Telugu: NameCheap for education free .me domain for students

NameCheap for Education – Get a free .me domain and Hosting from nc.me and GitHub Pages

పట్టుదల ఉంటె ఎంతటి కఠినమైన పనైనా సులువుగా పూర్తవుతుంది.

నేమ్ చీప్ అనేది డొమైన్ ప్రొవైడర్ ఇందులో మీరు డొమైన్ పేర్లు కొనచ్చు అమ్మచు అయితే నేమ్ చీప్- నేమ్ చీప్ ఫర్ ఎడ్యుకేషన్(NameCheap For Education) అనే పేరుతో ఉచితంగా .me డొమైన్ను nc.me వెబ్ సైట్ ద్వారా అందజేస్తుంది. 

 
ఎవరైతే తమ కెరీర్ ని వెబ్ డెవలపర్ గా లేదా డిజిటల్ మార్కెటింగ్ లో తమ స్థాయిని కనపరుచుకునేందుకు తమ తమ ఆలోచనలను ఈ డిజిటల్ ప్రపంచం వైపు మళ్లించడానికి ఈ డొమైన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

అయితే ఈ డొమైన్ను ఎలా పొందాలో కింద ఇట్చిన సమాచారాన్ని చదవి తెలుసుకోండి. 

ఈ డొమైన్ పొందడానికి ఎవరు అర్హులు:

నేమ్ చీప్ ఫర్ ఎడ్యుకేషన్(nc.me) అందించే ఈ ఉచిత .me డొమైన్ విద్యార్థులకు మాత్రమే.
అంటే కనీస వయసు 13 సంవత్సరాలు నిండి ఆపై ఉండాలి. హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారు కూడా ఈ డొమైన్ను ఉచితంగా పొందవచ్చు.
నేమ్ చీప్ ఎంపిక చేసిన యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ డొమైన్లను వారి స్కూల్ లేదా కాలెజితో లింక్ అయి ఉన్న ఇమెయిల్ ద్వారా అందజేస్తుంది.
దీని బట్టి US, UK, కెనడా మరియు ఆస్ట్రేలియా లో చదువుతున్న వారికి ఈ సౌలభ్యం ఉంది.
అయితే స్టూడెంట్ ఇమెయిల్ లేని వారు పైన ఇట్చిన్న యూనివర్సిటీస్ లో చదువని వారు కూడా ఈ డొమైన్ను పొందవచ్చు.
అది ఎలాగంటే ఒకవేళ మీరు గనుక గిట్ హబ్ స్టూడెంట్ ప్యాక్ లో చేరి ఉంటె మీకు ఈ .ME డొమైన్ తో పాటు మరెన్నో టూల్సును ఉచితంగా పొందవచ్చు.
 

ఈ డొమైన్ను ఉచితంగా పొందడం ఎలా?

ముందుగా మీరు nc.me వెబ్సైటుకి వెళ్ళండి. మీకు కింద చూపించిన వెబ్ పేజీ కనిపిస్తుంది.

  • ఇందులో find your free domain అని ఉన్న చోట మీకు నచ్చిన పేరును ఎంచుకోండి.
  • తర్వాత ఫైండ్ బటన్ ని నొక్కండి.
  • మీరు ఎంచుకున్న డొమైన్ ఉన్నట్లయితే మీకు కింద  చూపించినట్లుగా కనిపిస్తుంది.
  • ఒకవేళ మీరు ఎంచుకున్న డొమైన్ గనుక లేక పోతే taken అని సూచిస్తుంది.
  • మీరు ఎప్పుడైతే ఫైండ్ బటన్ నొక్కుతారో ఇంకా మీ ఎంచుకన్న డొమైన్ గనుక ఉన్నట్లయితే పైన సూచించినట్టుగా కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీ ఫ్రీ డొమైన్ని add బటన్ ద్వారా ఎంచుకోండి.
  • అప్పుడు యువర్ డొమైన్ బాక్స్ లో మీ డొమైన్ లిస్టయి కనిపిస్తుంది.
  • complete order బుట్టన్ని ప్రెస్ చేయండి.
  • summery వెబ్ పేజీకి వెళ్తారు.
 
  • ఇక్కడ మీరు GitHub Pages లేదా Exposure ని ఎంచుకోవచ్చు ఇవి రెండు మీకు ఉచితంగానే లభిస్తాయి కాకపోతే ఏదైనా ఒక్క దాన్ని మాత్రమే ఎంచుకోగలరు.

GitHub Pages:

గిట్ హబ్ పేజెస్ అనేది ఒక ఫ్రీ హోస్టింగ్ ప్లాట్ఫారం. మీరు గిట్ హబ్ పేజెస్ని ఎంచుకున్నటైతే మీ వెబ్ సైట్ని గిట్ హబ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
గిట్ హబ్ పేజెస్ ద్వారా మీకు 1 GB స్టోరేజ్, నెలకు 100 GB బ్యాండ్విడ్త్ పైగా గంటకు 10 బిల్డ్స్ చేయచ్చు.
 

Exposure :

exposure ఫొటోగ్రఫీకి సంబంధించింది ఇక్కడ మీరు తీసిన ఫొటోస్ని మీ డొమైన్ ద్వారా అందరికి షేర్ చేయచ్చు.

  •  మీరు మీకు నచ్చిన హోస్టింగ్ ని ఎంచుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీ ఇమెయిల్ని ఇవ్వాల్సి ఉంటుంది.
  •  ఇక్కడ మీరు మీ స్కూల్ కి కానీ కాలేజీకి కానీ లింక్ అయి ఉన్న ఇమెయిల్ ఎంటర్ చేయమంటుంది.
 
  •  ఒకవేళ మీదగ్గర స్టూడెంట్ ఇమెయిల్ ఉన్నట్టయితే ఎంటర్ చేయండి. లేని తరుణంలో మీరు మీ GitHub స్టూడెంట్ ప్రోగ్రామ్కి లింక్ అయి ఉన్న ఇమెయిల్ ని ఎంటర్ చేయండి.
  • ఒకవేళ మీరు GitHub స్టూడెంట్ ప్రోగ్రాం లో భాగస్వాములు కాకపోతే ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
  • GitHub ఎడ్యుకేషన్లో రిజిస్టర్ చేసుకునేప్పుడు మీరు స్టూడెంట కదా అని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది దీని కోసం మీరు మీ స్కూల్ లేదా కాలేజీ ID కార్డును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • మీ GitHub ఎడ్యుకేషన్ అకౌంట్ వెరిఫై కడానికి కనీసం 10 నుంచి 24 గంటల సమయం పట్టొచ్చు.
 
  • ఒక్కోసారి మీ అకౌంట్ అప్ప్రోవ్ కడానికి ఒకటి నుచి రెండు రోజులు పట్టచ్చు.
  • ఎప్పుడైతే మీకు మీ అకౌంట్ అప్ప్రోవ్ అయినట్టు ఇమెయిల్ వస్తుందో మీరు ఈ ఫ్రీ డొమైన్ ని పొందవచ్చు.
  • ఏ ఇమెయిల్ అయితే GitHub ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తారో అదే ఇమెయిల్తో మీ డొమైన్ను పొందేటప్పుడు వాడండి లేదంటే NameCheap మిమల్ని స్టూడెంట్గ వెరిఫై చేసుకోలేదు.
GitHub స్టూడెంట్ ప్యాక్లో ఫ్రీ డొమైన్ తో పాటు ఇంకెన్నో టూల్స్, కూపన్స్ ఉచితంగా లభిస్తాయి.
పైదానిలో ఎక్కడైనా తప్పులు ఉంటె మన్నించి కామెంట్ సెక్షన్ ద్వారా తెలుపగలరు.
ధన్యవాదాలు.
ఈ ఆర్టికల్ ని Englishలో చదువుటన్కు క్లిక్ చేయండి.
 
ఇట్లు,
ప్రవీణ్ సిరిమల్ల.
 

Prawin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *